A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దొనకొండలో సోలార్ పవర్ ప్లాంట్ వస్తే మంచిదే
Share |
February 23 2020, 10:49 am

ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలిస్తున్నట్లు వార్త వచ్చింది. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలన్న ఆలోచన జరుగుతోంది.
ఇందుకోసం సుమారు ఐదువేల ఎకరాలు అవసరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెడ్‌క్యాప్‌ సంస్థ బృందం ఈ ప్రాంతంలో భూముల పరిశీలన చేపట్టింది.దొనకొండలో 25,086 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్టు రెవెన్యూ శాఖ సర్వే ద్వారా గుర్తించారు. నెడ్‌క్యాప్‌ డీజీఎం సీబీ జగదీశ్వరరెడ్డి, ప్రకాశం జిల్లా మేనేజర్‌ జి.బుచ్చిరాజు గతవారం ఈ భూములపై హైలెవెల్‌ టెక్నికల్‌ సర్వే నిర్వహించారు.సుమారు రూ.4 వేల కోట్లతో ఈ ప్లాంట్‌ను చేపట్టి ఏడాదిలో పూర్తి చేసి.. ఆ తరువాత ఏడాదికల్లా విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టవచ్చని వారు తెలిపారు.

ఇలాంటివి ఆచరణలోకి వస్తే మంచిదే. ప్రచారానికి పరిమితం కాకుండా ఉండాలి.

tags : donakonda, solar

Latest News
*ట్రంప్ బాహుబలి- వీడియో వైరల్
*మోకాలికి, బోడిగుండుకు ఈనాడు లింక్ పెట్టిందా
*తెలంగాణలో 45 వేల ఎకరాల్లో పామాయల్ సాగు
*ట్రంప్ కుమార్తె ప్రొగ్రాం కు సి.ఎమ్.ను పిలవాలా
*సిట్ - నా సేవలన్ని కూడా వాడుకోండి-బిజెపి నేత
*కార్పొరేట్లకు కేంద్రం ఊడిగం చేస్తోంది
*రైతు రుణమాపీల వల్ల లాభం ఉండదు-వెంకయ్య
*ఎపిలో ఎన్ని వార్తల్ని ఖండించాలో
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info