A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలీసుల్ని కాదు.. నేతల్ని తప్పుపడతా-పవన్
Share |
February 25 2020, 10:50 am

సుగాలి ప్రీతి గురించి జగన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడరు..?అని జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కర్నూలులో ఆయన చేసిన ప్రసంగాన్ని జనసేన విడుదల చేసింది. ఆ వివరాలు కొన్ని ఇలా ఉన్నాయి.
పక్క రాష్ట్రమైన తెలంగాణలో దిశ దుర్ఘటన జరిగితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో
కూర్చొని చట్టాలు చేశారు. రాయలసీమ ఆడ బిడ్డను అమానుషంగా అత్యాచారం చేసి హత్య
చేస్తే జగన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. దిశ గురించి మాట్లాడిన మీరు
సుగాలి ప్రీతి గురించి ఎందుకు మాట్లాడరు..? తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులను
రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఎండగడుతున్నప్పుడు... వారి హయాంలో న్యాయం జరగని
సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం ఎందుకు చేయలేకపోతున్నారు..? సుగాలి ప్రీతికి
న్యాయం జరిగినట్లయితే ఇవాళ నేను రోడ్ల మీదకు రావాల్సిన అవసరం వచ్చేది కాదు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు. బలహీన వర్గాలకు చెందిన
ఆడబిడ్డకు అన్యాయం జరిగితే మాత్రం ఒక్కరు కూడా న్యాయం చేయలేకపోయారు. సుగాలి
ప్రీతికి న్యాయం చేయాలని, ఆడబిడ్డలకు అన్యాయం జరగకుండా కఠిన చట్టాలు తేవాల్సిన
అవసరం ఉందని దిశ ఘటన జరగక ముందే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాను. కానీ వారిలో చలనం
లేదు. సుగాలి ప్రీతి విషయంలో ఏం జరిగిందో... ఎలా జరిగిందో రాష్ట్రం మొత్తం
తెలియాల్సిన అవసరం ఉంది.
• మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాం
సుగాలి ప్రీతిపై అత్యాచారం జరిగి హత్య చేసింది విద్యాసంస్థలో.
విద్యనభ్యసించాల్సిన చోట ఇలాంటి దారుణానికి గురైతే ఎవరు రక్షిస్తారు. ఇలాంటి
కీచకులకు రాజకీయ నాయకులు అండగా ఉంటే బాధితులు తమ వేదనను ఎవరికి చెప్పుకొంటారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి సుగాలి ప్రీతి కేసును సీబీఐకి
అప్పగించకపోతే మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించి జరిగిన అన్యాయాన్ని వివరిస్తాను.
• సత్వర విచారణ జరగాలి
సుగాలి ప్రీతి విషయంలో పోలీసు యంత్రాంగాన్ని తప్పుబట్టడం లేదు. రాజకీయ నాయకులను
తప్పుబడుతున్నాను. పోలీసు వ్యవస్థను రాజకీయ నాయకులు ఎలా నడిపిస్తారో అలా
నడుస్తుంది. పోలీసు ఉన్నతాధికారులకు న్యాయం చేయాలనే ఉంటుంది కానీ, రాజకీయ బాసుల
వల్ల చేయలేకపోతున్నారు. అని ఆయన అన్నారు.
.....................

టిడిపి హయాంలో జరిగిన ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేదో!

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info