A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ ఏడాది కేంద్రం తక్కువ నిదులు ఇచ్చింది-జగన్
Share |
August 4 2020, 5:16 pm

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసిందని, ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించాలని ప్రదాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలో ఏ ఏడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే అని ప్రధాని దృష్టికి తెచ్చారు. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కడప స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలని విన్నవిస్తూ, కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు.

రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే... కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులునూ వెంటనే విడుదలయ్యేలా చూడాలన్నారు. గడిచిన ఆరేళ్లలో 7 జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారని, గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవని, రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలన్నారు. అక్కడ ఒక వ్యక్తికి తలసరి రూ.4000 ఇస్తే, ఇక్కడ రూ.400 మాత్రమే ఇస్తున్నారని ప్రధానికి తెలిపారు.

tags : jagan, modi

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info