A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
18న కర్నూలులో అవ్వతాతలకు కంటివెలుగు
Share |
August 4 2020, 5:00 pm

కంటి వెలుగు పథకం మూడో విడతలో భాగంగా... పిల్లలకు చేయాల్సిన సర్జరీలను వేసవి సెలవులు నాటికి వాయిదా వేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలిపారు. స్పందన కార్యక్రమంలో వారు ఈ విషయం చెప్పారు. ‘‘25 రోజుల విశ్రాంతి అవసరం ఉన్న దృష్ట్యా తల్లిదండ్రుల కోరిక మేరకు కంటి శస్త్రచికిత్సలు వాయిదా వేశాం. కళ్లజోళ్లు కూడా అవసరమైన విద్యార్థులకు పంపిణీచేస్తున్నాం. మూడోవిడత కంటి వెలుగు కింద 56 లక్షలమంది అవ్వాతాతలకు స్క్రీనింగ్‌. అవ్వాతాతలకు పెన్షన్ల పంపిణీతో పాటు వాలంటీర్లచే కళ్లజోళ్లు పంపిణీ. మార్చి నుంచి అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు. గ్రామ సచివాలయాల్లోనే స్క్రీనింగ్‌. ప్రతి మండలానికి 2 నుంచి 3 టీంలు. దీనికోసం రూట్‌మ్యాప్‌లు సిద్ధంచేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘కలెక్టర్లంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. నియోజకవర్గాల వారీగా బృందాలను ఏర్పాటు చేయాలి. కంటివెలుగు మూడోవిడత ‘‘అవ్వా-తాత’’ కార్యక్రమం 18న కర్నూలులో ప్రారంభం. ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటాను. ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులకూ అదే రోజు శంకుస్థాపన. 4906 సబ్‌ సెంటర్లను నిర్మిస్తున్నాం. 4472 సబ్‌ సెంటర్లకు స్థలాలు గుర్తించారు. మిగిలిన వాటికి వెంటనే స్థలాలను గుర్తించాలి. ఈ నెలాఖరుకల్లా పనులు ప్రారంభం అవుతాయి’’అని తెలిపారు.

tags : eye tests, ap

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info