A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పేదల ఇళ్ల స్థలాలకు చంద్రబాబు అడ్డు- జగన్
Share |
August 4 2020, 5:04 pm

తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఆయన స్పందన కార్యక్రమంలో అదికారులతో మాట్లాడారు.
‘‘ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి. స్పందన ద్వారా 2 లక్షల పైచిలుకు వినతులు వస్తే 1 లక్షా 3 వేల వినతులకు శాంక్షన్‌ ఇచ్చాం. కరెంటు బిల్లులు ఎక్కువగా రావడం వల్ల దాదాపు 40 వేల వినతులను పెండింగులో ఉన్నట్టు చూస్తున్నాం. పూరిగుడిసెలో ఉన్నవాళ్లకు కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని ఆపేయడం కరెక్టు కాదు. గ్రామ వాలంటీర్‌ ద్వారా లబ్ధిదారులను గుర్తించి.. ఇళ్లపట్టా పొందడానికి అర్హుడు అని అనిపిస్తే.. వెంటనే ఇళ్లపట్టా ఇవ్వండి. నేను గ్రామాల్లో తిరిగే సరికి... ఇంటి పట్టా మాకు లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు. ఇళ్లపట్టాల విషయంలో కలెక్టర్లు చురుగ్గా పనిచేయాల్సి ఉంది. లక్షలమంది మనపై ఆశలు పెట్టుకున్నారు. వచ్చే 2 వారాలు అధికారులు ఇళ్లపట్టాలపై దృష్టిపెట్టాలి. ప్లాటింగ్, మార్కింగ్‌ పనులు త్వరితగతిన పూర్తికావాలి. ఇళ్లపట్టాలకు అవసరమైన భూమిని మార్చి 1 కల్లా సిద్ధం చేయాలి. 25 లక్షలమంది పట్టాలు ఇవ్వాలన్న మంచి కార్యక్రమం దిశగా మనం అడుగులు వేస్తుంటే... దీన్ని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కేసులు పెట్టి.. అడ్డుకోమని టెలికాన్ఫరెన్స్‌ల్లో తన నాయకులకు చెప్తున్నాడు. భూములు కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు సాగాలి. అనుకున్నచోట భూములు దొరకని పక్షంలో ప్లాన్- బీ కూడా కలెక్టర్లు సిద్ధంచేసుకోవాలి. ఇంటి స్థలం లేని నిరుపేద రాష్ట్రంలో ఉండకూడదు. కావాల్సిన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఉగాది రోజు ఆ కుటుంబాల్లో కచ్చితంగా పండుగ వాతావరణం ఉండాలి. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి 6 లక్షల ఇళ్లు చొప్పున నిర్మించుకుంటూ పోతాం’’ అని సీఎం జగన్‌ అధికారులతో పేర్కొన్నారు.

tags : jagan,house sites

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info