A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ ,బిజెపిలు కకావికలం-డిల్లీ విశ్లేషణ
Share |
August 14 2020, 9:49 am

డిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మి పార్టీ మరోసారి ఘన విజయం సాదించడం చెప్పుకోదగిన అంశమే. ఎట్టి పరిస్థితిలోను ఆమ్ ఆద్మి పార్టీని ఓడించి అదికారంలోకి రావాలన్న బిజెపి ఆశలు నీరుకారిపోయాయి.ఆమ్ ఆద్మి పార్టీ అదినేత అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతున్నందుకు ఆయనకు అబినందనలు . కేజ్రీవాల్ దేశ రాజకీయాలలో ఒక కొత్త పినామినా అని చెప్పాలి. ఆయన కొత్త తరహా రాజకీయాలు చేయడానికి తన ఉద్యోగాన్ని వదలుకుని ప్రజా జీవితంలోకి వచ్చారు. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన కేజ్రీవాల్ ఆ తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ విషయంలో ఆయన అన్నాహాజరేతో కూడా విబేధించారు. అయితే అవినీతి విషయంలో రాజీపడలేదనే చెప్పాలి. ఆయన ఒకసారి బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం .కాని అనతి కాలంలో అసెంబ్లీని రద్దు చేయడం విమర్శలకు దారి తీసింది.అయినా డిల్లీ ప్రజలు మళ్లీ ఆయనకే భారీ ఎత్తున విజయం సమకూర్చారు. 70 సీట్లకు గాను 67 సీట్లు ఆమ్ ఆద్మి పార్టీకే ఇచ్చి సంచలనం సృష్టించారు. చీపురు గుర్తుతో ప్రజల ముందుకు వచ్చిన ఈ పార్టీ దెబ్బకు జాతీయ పార్టీలుగా ఉన్న బిజెపి, కాంగ్రెస్ అక్కడ కకావికలం అయ్యాయి. ఆ రెండు పార్టీలకు కలిపి మూడు సీట్లే దక్కాయి. 2020 ఎన్నికలు కూడా దాదాపు అదే రీతిలో ఫలితాలు ఇచ్చాయని చెప్పాలి.బిజెపికి గణనీయంగా ఓట్ల శాతం పెరిగినా , సీట్లు మాత్రం కేవలం ఏడు మాత్రమే వచ్చాయి. ఆమ్ ఆద్మి పార్టీకి 53 శాతం పైగా ఓట్లు రావడం ఒక రికార్డే. ఇటీవల ఎపి ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 50 శాతం ఓట్లు రావడం సంచలనం అయితే దానిని మించి పూర్తి స్థాయి రాష్ట్రం కానప్పటికీ డిల్లీలో ఆమ్ ఆద్మి పార్టీ సాదించింది. బిజెపికి 43 శాతం ఓట్లు తెచ్చుకున్నా సీట్లు మాత్రం కేవలం ఎనిమిది మాత్రమే రావడం బిజెపికి పెద్ద ఆశాభంగమే అని చెప్పాలి.కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయం. ఒక్క సీటు గెలుచుకోలేకపోగా, పోటీచేసిన 66సీట్లకు గాను 63 చోట్ల డిపాజిట్లు పోగొట్టుకుంది. ఆమ్ ఆద్మి పార్టీ విజయం క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కే దక్కుతుంది.ఆయన అనుసరించిన విధానాలే ఆయనకు విజయం తెచ్చి పెట్టాయి. ఒక కేంద్రంతో పోరాటం, మరో వైపు కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ తో నిత్యం తగాదా పడవలసి రావడం,ఇంకో వైపు తను అనుకున్న కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడం..వీటన్నిటిలో ఆయన విజయం సాదించారు.లెప్టినెంట్ గవర్నర్ కు ఆయన రోజుల తరబడి నిరసన తెలిపిన తీరు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక దశలో ఆయన బిజెపికి వ్యతిరేకంగా కూటమి కట్టడానికి ఇతర రాష్ట్రాల నేతలతో జట్టుకట్టే యత్నం చేసినా, లోక్ సభ ఎన్నికల తర్వాత అవన్ని మానుకుని ఆయన తన మానాన తను పనిచేసుకుని విజయం సాధించారని చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ సా,ఇటీవలే బిజెపి అద్యక్షుడు అయిన జెపి నడ్డాలకు ఈ ఫలితాలు కొంచెం ఇబ్బంది కలిగించేవే.నిజానికి వారు ఈ ఎన్నికలను ఇంత సీరియస్ గా తీసుకుని ఉండాల్సింది కాదు. లోకల్ బిజెపి నేతలకు వదలిపెట్టి ఉండాల్సింది.కాని మోడీ 30 అసెంబ్లీ సీట్లలో ఆయన ప్రచారం చేశారట. హోం మంత్రి షా అయితే కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగి ప్రచారం చేశారు.200 మంది బిజెపి ఎమ్.పిలు డిల్లీని చుట్టేశారు.యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ తదితరులు కూడా తమ వంతు పాత్ర పోషించారు. అయినా ప్రజలు ఆమ్ ఆద్మి పార్టీకే పట్టం కట్టారు .ఇక్కడ రాజకీయం వ్యూహం కూడా కేజ్రీవాల్ కు కలిసివచ్చినట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి డిల్లీలో గతంలో వచ్చిన ఓట్లు రాలేదు.అంటే దానర్దం కాంగ్రెస్ వారు బిజెపిని ఓడించడానికిగాను ఆమ్ ఆద్మి పార్టీకే మద్దతు ఇచ్చారన్న అబిప్రాయం ఉంది.దీనివల్ల బిజెపి ఆశించిన ఫలితాలు సాదించలేకపోయిందని అంటున్నారు. ఈ రాజకీయ వ్యూహం సంగతి అలా ఉంచితే, కేజ్రీవాల్ అవినీతి రహితంగా పాలన సాగించడం గొప్ప విషయమే. 200 యూనివట్ల వరకు విద్యుత్ ఉచితం గా ఇవ్వడం, నీటిని కూడా కొన్ని యూనిట్ల వరకు ఉచితం గా ఇవ్వడం, బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం, స్కూళ్లను మెరుగుపరచడం, బస్తీ క్లినిక్ లు పెట్టడం వంటి స్కీములు బాగా పనిచేశాయని చెబుతున్నారు.విద్య,వైద్యం వంటి రంగాలకు అదిక ప్రాదాన్యం ఇవ్వడం వల్ల పేద ప్రజలు బాగా ఆకర్షితులు అయ్యారనుకోవాలి.ఇక్కడ మరో అంశాన్ని కూడా పరిశీలించాలి.లోక్ సభ ఎన్నికలలో డిల్లీలోని ఏడు లోక్ సభ సీట్లను బిజెపి గెలుచుకుంది. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చాలా ఇబ్బంది పడ్డారు. అవి జాతీయ ఎన్నికలు కావడంతో మోడీని ఎన్నుకున్నామని, ఇవి రాష్ట్ర ఎన్నికలు కనుక కేజ్రీవాల్ కు ఓటు వేస్తున్నామని ప్రజలు చెప్పారు.ఒక రకంగా ఇది పరిణితి చెందిన ప్రజాస్వామ్యం అనుకోవాలి. కర్నాటక జెడిఎస్ , కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బిజెపి అత్యదిక సీట్లు గెలుచుకుంది. పూర్తిగా కాంగ్రెస్ అదికారంలో ఉన్న మద్య ప్రదేశ్,రాజస్తాన్ వంటి రాష్ట్రాలలో సైతం లోక్ సభ ఎన్నికలలో బిజెపి గెలవడం గమనించవలసిన అంశమే, అలాగే తెలంగాణలో కూడా బిజెపి ఆ లోక్ సభ ఎన్నికలలో నాలుగు సీట్లు గెలిచింది. ఒక్క ఎపిలో మాత్రం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు రెంటిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఘన విజయం సాదించింది. ఓటర్లు ఒక రకంగా స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి ఆయా రాష్ట్రాలలో మొగ్గు చూపారని అనుకోవాలి.బవిష్యత్తులో కేజ్రీవాల్ మళ్లీ జాతీయ రాజకీయాలపై దృష్టిపెడతారా?లేక డిల్లీకే పరిమితం అవుతారా అన్నది చర్చనీయాంశమే.గతంలో కూడా కేజ్రీవాల్ ఆ ప్రయత్నాలు చేయకపోలేదు. కాని డిల్లీలో విజయవంతం అయినట్లు ఇతర చోట్ల సఫలం కాలేదు.కాస్తో,కూస్తో పంజాబ్ లో తమ ఉనికి చాటుకున్నారు. దక్షిణాది రాజకీయ,సామాజిక వాతారణంలో పార్టీకి ఒక నాయకత్వం లేకుండా ఈ ప్రాంతంలో ఆమ్ ఆద్మి పార్టీ ప్రజాదరణ చూరగొనడం అంత తేలికకాదు. ముందుగా ఉత్తరాది రాష్ట్రాలలో ఏమైనా పుంజుకుంటే అప్పుడు ఇటువైపు కూడా విస్తరించవచ్చు. అదే సమయంలో మమత బెనర్జీ, చంద్రబాబు నాయడు వంటివారితో కూడా కొంతకాలం స్నేహం చేశారు.మిగిలినవారి సంగతేమోకాని చంద్రబాబు తో కేజ్రీవాల్ చేయి కలపడం చాలా విమర్శలకు దారి తీసింది.విశాఖ వచ్చి చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేసినా భంగపాటు తప్పలేదు. చంద్రబాబు ఓటమి తర్వాత వారి స్నేహం కొనసాగినట్లు లేదు. చంద్రబాబు డిల్లీ వెళ్లి కేజ్రీవాల్ కు అనుకూలంగా ప్రచారం చేసే సాహసం కూడా చేయలేదు.ఏది ఏమైనా కేజ్రీవాల్ అఖండ విజయం సాదించారు. ఆయన మరింత సమర్దంగా పాలన సాగించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిద్దాం.

tags : kejriwal, victory

Latest News
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info