A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జడ్జిలు భూములు కొనుగోలు చేశారని ...
Share |
February 23 2020, 9:19 am

రాజధానికి సంబందించి ,భూముల వ్యవహారంలో ప్రభుత్వ ముఖ్యుల వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని హైకోర్టులో రైతుల తరపున న్యాయవాది వాదించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, న్యాయమూర్తులు, ఏజీలు, పత్రికాధిపతుల చేతుల్లో రాజధాని భూములున్నాయని సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారు వ్యాఖ్యానించారని లాయర్ మురళీధరరావు తెలిపారు. పబ్లిక్‌ సర్వెంట్లుగా ఉండి న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడ్డమంటే అది చట్ట నిబంధనల ఉల్లంఘనే. ఐఏఎస్‌ అధికారులు సైతం రాజధాని వ్యవహారంలో సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి. మాజీ సీఎం చంద్రబాబు న్యాయస్థానాలను ప్రభావితం చేస్తున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రే పేర్కొన్నారు’’ అని ఉన్నం మురళీధరరావు పేర్కొన్నారు.

tags : ap,highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info