A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డీజిల్ వాహనాలు తగ్గించాలి-సి.ఎమ్
Share |
February 25 2020, 11:27 am

డీజిల్‌ వాహనాలు తగ్గించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అదికారులను కోరారు. ఆయన జిల్లా కలెక్టర్ ల సమావేశంలో మాట్లాడారు.సముద్రం ఒడ్డున లేని నగరాల్లో కాలుష్యం పెరిగే అవకాశాలు ఎక్కువ. ఢిల్లీకి అదే సమస్య ఉంది. ఇప్పుడు నివాసయోగ్యమైన నగరాల జాబితాలో ముందున్న హైదరాబాద్‌ను మనం నిర్లక్ష్యం చేస్తే కాలుష్య కాసారం అవుతుంది. కాబట్టి నగరంలో కాలుష్య నివారణకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించి అమ లు చేయాలి. డీజిల్‌ వాహనాలు తగ్గించి, ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య పెంచాలని కెసిఆర్ చెప్పారు.పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాల్లో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో మునిసిపల్‌ సమ్మేళనం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమ్మేళనానికి మేయర్లు, చైర్‌ పర్సన్లు, కార్పొరేషన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లను పిలిచి, శిక్షణ ఇవ్వాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాని కన్నా ముందే అన్ని వార్డుల్లో కమిటీలను నియమించాలన్నారు.

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info