A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్య పడవద్దు
Share |
February 25 2020, 8:15 am

దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని ఆయన ఆయన పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. దేశంలో బీజేపీ మతచిచ్చు రేపుతోందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా బీజేపీ నాయకులు నియంత పాలన చేస్తున్నారని , అదే విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా అదే పంథాలో నడుస్తున్నారని, నిరసనలకు కూడా అనుమతి ఇవ్వడం లేదన్నారు.
ఎన్నికల్లో మద్యం, డబ్బుతో గెలుస్తున్నారని, టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి గెలుపోటములు కొత్తకాదని.. గెలుపుతో పొంగిపోమని, అలాగే ఓటమితో కుంగిపోమని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు అధికార దుర్వినియోగం చేశారని, విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసి గెలిచారని వ్యాఖ్యానించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక‍్తం చేశారు. కార్యకర్తలు ఎవరూ అధైర‍్యపడవద్దని ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు.

tags : uttamkumar reddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info