A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మండలిని రద్దు చేయడం తప్పన్న చంద్రబాబు
Share |
February 25 2020, 11:29 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొహమాటం లేకుండా యుటర్న్ తీసుకున్నారు. గతంలో మండలి దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు మండలి సమున్నత ఆశయాలతో ఏర్పడిందని చెబుతున్నారు.మండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేయడం విచారకరమని ఆయన అన్నారు. మూడు రాజధానుల బిల్లును మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపారనే ఆక్రోశంతో శాసన మండలి రద్దుకు తీర్మానం చేసి పంపడం సరి కాదని ఆయన అన్నారు. దేశంలో లోక్ సభకు ఎన్ని అధికారాలు ఉన్నాయో.. రాజ్యసభకూ అలాగే ఉంటాయన్నారు. బిల్లుల విషయంలో ఎవరు రాజకీయాలు చేశారో చెప్పాలని ఆ అన్నారు. వైసిపిలో అంతా నేరస్తులే ఉన్నారని ఆయన ఆరోపించారు.ఆ ముఠాను మేధావులు అనే స్థితికి తీసుకొచ్చారని ఆయన అన్నారు. ఓటింగ్ లో నాటకాలు జరిగాయని ఆయన ఆరోపించారు.

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info