A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
Share |
February 25 2020, 10:28 am

శాసనమండలి రద్దు తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఓటింగ్ నిర్వహించడ విశేషం.దీనికి మూడింట రెండు వంతుల మంది మద్దతు అససరం నేపద్యంలో స్పీకర్ ఈ నిర్ణయం చేసినట్లుగా ఉంది. నిజానికి టిడిపి సభలో లేదు. ఏకగ్రీవంగా దీనిని పాస్ చేసినట్లు ప్రకటించవచ్చు.సభలో సభ్యులుకాని మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ లను వేరుగా కూర్చోవాలని స్పీకర్ కోరారు.వారిద్దరూ అసెంబ్లీ సభ్యులు కాకపోవడంతో ఆయన ఈ సూచన చేశారు. బెల్ మోగిన తర్వాత ఎవరూ లోపలకుర రారని, అలాగే బయటకు వెళ్లరని ఆయన ప్రకటించారు.తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారంతా లేచి నిలబడాలని స్పీకర్ కోరగా అంతా లేచి నిలబడ్డారు.అప్పుడు అంతా లేచి నిలబడ్డారు.తదుపరి వ్యతిరేకించేవారు నిలబడాలని కోరగా ఎవరూ లేవలేదు.అలాగే తటస్థులు లేవాలని అడిగారు. అప్పుడు కూడా ఎవరూ లేవలేదు. దీంతో సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించినట్లు అయింది.తీర్మానానికి అనుకూలంగా 133 మంది ఓటు వేశారని ప్రకటించారు. దీంతో తీర్మానం ఆమోదం పొందినట్లు ప్రకటించారు. మూడింట రెండువంతుల మంది మద్దతు పలకాలని నిబందన చెబుతోందని, అందువల్ల ఇది ఆమోదం పొందిందని ఆయన అన్నారు.కొంతమంది వైసిపి సభ్యులు సబకు హాజరు కాలేదు.

tags : tammineni sitaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info