A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎలా దిక్కుమాలిన రాతలు రాశారో చూడండి-జగన్
Share |
February 25 2020, 11:28 am

ఏడాది కాలంలో తమ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం మండలిలో ఉన్నప్పటికీ తాము ప్రజల కోసం, విశాల ప్రయోజనాల కోసం మండలి రద్దు నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఇప్పుడు తాము ఎమ్మెల్సీలను కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నామని, టిడిపి పత్రికలు దారుణంగా రాస్తున్నాయని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటే ఈ మీడియా ఏమైనా రాసిందా? 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా టిడిపిలో చేర్చుకుని, నలుగురికి మంత్రి పదవులు ఇస్తే ఈ మీడియా ఒక్క ముక్క రాయలేదు. పైగా చంద్రబాబు రాజనీతి, ఆయనను చూసి పార్టీ మారుతున్నారని దిక్కుమాలిన రాతలు రాశాయి. ఓటుకు కోట్లు పెట్టి తెలంగాణలో దొరికితే ఈనాడు, చంద్రజ్యోతి, టివి 5 వంటివి ఒక్క రోజు అయినా రాశాయా అని ఆయన ప్రశ్నించారు.ఇలాంటి రాజకీయాలు చేయాలని తాము అనుకోవడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు మాదిరే తాను ఆలోచన చేసి ఉంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా అయినా ఉండేదా అని జగన్ అన్నారు. రాజకీయాలను మార్చడానికి వచ్చామని గర్వంగా చెబుతున్నానని జగన్ తెలిపారు.గురువారం ప్రతిపాదించాం. సభను సోమవారం పెట్టాం. అయినా మాట మార్చబోతున్నామని, ఐదు కోట్ల ఆఫర్ చేయబోతున్నామని ఆ పత్రికలు,టివీ చానళ్లు ప్రచారం చేశాయని ఆయన అన్నారు.ఈ మూడు రోజుల సమయం కూడా ఇవ్వకపోతే ఈ ఎల్లో మీడియా ఏకపక్షంగా జగన్ నిర్ణయం తీసుకున్నారని, ఎవరి సలహాలు తీసుకోలేదని రాసేవారని ఆయన అన్నారు.

tags : jagan yellow media

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info