A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడు ఆనాటి సంపాదకీయంఇది..జగన్
Share |
February 25 2020, 10:33 am

గతంలో శాసనమండలిని బురదగా ఈనాడు పత్రిక అబివర్ణించిందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.1983 లో మండలిని రద్దు చేయడాన్ని ఈనాడు సమర్దిస్తూ రాసిన సంపాదకీయాన్ని జగన్ చదివి వినిపించారు. అఖండమైన మెజార్టీతో గెలిచిన ప్రబుత్వానికి అడ్డుకట్ట వేయడాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అని ఈనాడు రాసిందని అన్నారు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షాన్ని గుర్తించాలని, అలాకాకుండా అడ్డదారి తొక్కితే పరిస్థితి మరింతగా విషమిస్తుందని ఆయన అన్నారు. ఎంత చక్కగా ఈనాడు అప్పట్లో మండలి రద్దు పై రాసిందని ఆయన వ్యాఖ్యానించారు. మండలిని ఒక మనిషి కోసం రద్దు చేశారని, ఆయన ఈనాడు అదినేత రామోజీరావు అని ఆయన అన్నారు. ఒక్క మనిషి కోసం రద్దు చేస్తే అంత గొప్పగా ఈనాడు రాశారని, ఇప్పుడు కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం రద్దు చేస్తుంటే ఏమి రాస్తున్నారో చూడాలని అన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});