A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా?వద్దా-జగన్
Share |
February 25 2020, 11:29 am

మనందరి ముందు ఉన్న ప్రశ్న కేవలం శాసనమండలి భవిష్యత్తుకు సంబందించింది మాత్రమే కాదని, ప్రజాస్వామ్యం బతికించుకోవాలా. వద్దా, ప్రభుత్వాలు పనిచేయాలా?వద్దా అన్నది కూడా అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాజ్యాంగం ప్రకార ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం అసెంబ్లీకి జవాబుదారిగా ఉంటుందని చెప్పిందని ఆయన అన్నారు. రాజ్యాంగం నిజంగానే మండలి అవసరం ఉందని అనుకుంటే దానిని రద్దు చేయకుండా నిబందనలు పెట్టేవారని, అలాకాకుండా శాసనసభ కే వదలి వేశారని, రద్దు అధికారాలు కూడా అసెంబ్లీకే ఇచ్చారని ఆయన అన్నారు. దేశంలో తక్కువ అక్షరాస్యత ఉన్న రోజులలో ఈ మండలి అవసరం ఏర్పడిందని, ఇప్పడు శాసనసభకు ఆ దుస్తితి లేదని అన్నారు. ఈ సభలో 38 మంది పిజి, పదమూడు మంది డాక్టర్ లు, అరవై మూడు మంది గ్రాడ్యుయేట్లు, ముగ్గురు సివిల్ సర్వీసెస్ అదికారులు, ఒక ప్రొపెసర్, ఒక జర్నలిస్టు, ఒక రైటర్,ఇద్దరు టీచర్లు ఉన్నారని,వీరంతా నేరుగా ఎన్నుకున్న ప్రజా ప్రతినిదులని ఆయన అన్నారు. కేవలం ఆరు రాస్ట్రాలలోనే ఈ మండలులు ఉన్నాయని ఆయన చెప్పారు.అపొం బెంగాల్ వంటి రాష్ట్రాలు మండలులను ఉపసంహరించుకున్నాయని ఆయన చెప్పారు. ఎందుకు ఇక్కడ చేసిన బిల్లులు మండలికి ఎందుకు వెళ్లాలన్నదానికి సమాధానం లేదని ఆయన అన్నారు. మండలి చేసిన సవరణ లు పాటించవలసిన అవసరం లేనప్పుడు అసలు చట్టం ఎందుకు పంపాలని ఆయన అన్నారు.కేవలం ప్రభుత్వం చేసి బిల్లును అడ్డుకోవడానికే మండలి ఉంటే ఏమి చేయాలని ఆయన అన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info