A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మండలి రద్దుకు జనసేన మద్దతు
Share |
February 25 2020, 10:35 am

ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టిన శాసనమండలి రద్దు బిల్లును సమర్దిస్తున్నట్లు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రకటించారు. ఆయన దీనికి సంబందించిన తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడారు. వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకోవడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు అసెంబ్లీలోనే అన్ని రకాల నిపుణులు ఉన్నారని, ఇంకా వేరే సభ అవసరం లేదని ఆయన అన్నారు. 154 మంది సభ్యులు తీర్మానం చేసి పంపితే మండలి తిరస్కరిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. బలహీనవర్గాలకు ఉపయోగపడే ఆంగ్ల మాద్యమం బిల్లును తెస్తే అసెంబ్లీలో చంద్రబాబు సమర్దించారని, కాని మండలిలో ఆయన పార్టీ వ్యతిరేకించిందని ఆయన అన్నారు. అన్నదమ్ముల్లా ఉండే మాల,మాదగలను చంద్రబాబు విడదీశారని ఆయన అన్నారు. నిరసన చెప్పేవారిపై గుర్రాలతో తొక్కించారని అన్నారు. విడదీసి పాలించడం చంద్రబాబు లక్షణమని ఆయన అన్నారు. మండలి చైర్మన్ షరీప్ పెద్దమనిషి అని, అలాంటి వ్యక్తిని చంద్రబాబు ప్రభావితం చేశారని ఆయన అన్నారు.

tags : rapaka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info