A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మండలిలో శాసనసభను అవమానిస్తారా-రోజా
Share |
February 25 2020, 11:30 am

రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ వికేంద్రీకరణ బిల్లు తెచ్చారని నగరి వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇన్నాళ్లకు ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రజల కష్టాలు తీర్చడానికి ఒక నాయకుడు వచ్చారని అంతా సంతోషిస్తున్నారని ఆమె అన్నారు. అన్ని ప్రాంతాలకు సమ ప్రాదాన్యం ఇవ్వడమే జగన్ లక్ష్యం అని ఆమె అన్నారు. గాయం విలువ తెలిసిన వాడే న్యాయం చేస్తాడని, అలాగే జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నో గాయాలను భరించారని, ఇప్పుడు అదికారంలోకి వచ్చాక, ప్రజలకు న్యాయం చేస్తున్నారని రోజా అన్నారు. 151 మంది ఎమ్మల్యేలు తీసుకు వచ్చిన బిల్లును మండలి లో అవమానిస్తూ చూస్తూ ఊరుకోవాలా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు వంటి రాజకీయ క్రిమినల్స్ ఘోరంగా వ్యవహరిస్తుంటారని రోజా మండిపడ్డారు.తెలుగు గడ్డ పై ఎవరికి సాద్యం కాని విజయం సాదించిన మొనగాడు జగన్ అని , దేశం గర్వించే రీతిలో ఆయన పాలన చేస్తున్నారని రోజా ప్రశంసించారు.నాలుగో ఉత్తమ సిఎమ్.గా ఎంపికయ్యారని ఆమె అన్నారు.

tags : roja

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info