A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖలో ప్రైవేటు భూమి తీసుకోవడం లేదు
Share |
February 25 2020, 10:37 am

వశాఖలో కార్యనిర్వాహక రాజధాని గా ఏర్పాటు చేయడానికి ప్రైవేటు భూమి దాదాపుగా తీసుకోబోమని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని అనకాపల్లి వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్ చెప్పారు.ఆయన శాసనమండలి రద్దు తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు.విశాఖ ఎక్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదన వచ్చాక తాము సి.ఎమ్. జగన్ ను ఎంత భూమి అవసరం అవుతుందని అడిగామని, అప్పుడు ఆయన ప్రవేటు లాండ్ దాదాపు తీసుకోబోమని, ప్రభుత్వ భూమి మూడు వేల ఎకరాలు సరిపోతుందని అన్నారని ఆయన చెప్పారు. శాసనమండలి లో చర్చ జరగరాదని టిడిపి చెబుతోందని, దీనికి సంబందించిన చర్చ అసెంబ్లీలో కాకుండా టిడిపికి మద్దతు ఇచ్చే ఎబిఎన్ చానల్ లోకాని, ఈటివిలో కూడా చర్చించాలా అని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు తన రియల్ ఎస్టేట్ కోసం అమరావతిలో ఉద్యమం నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. ఎప్పుడే ఏ అభివృద్ది కార్యక్రమం చేపట్టినా టిడిపి వారు, వారి పత్రికలు ఇలాగే అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తుంటాయని ఆయన అన్నారు. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గాఉన్నప్పుడు జమ్మల మడుగు వద్ద స్టీల్ ప్లాంట్ పెట్టాలని ప్రయత్నిస్తుంట. ఆ బూమి లో ప్రాచీన గుళ్లు, సెలయేళ్లు, జింకలు, దుప్పలు ఉన్నాయంటూ పచ్చి అబద్దాలు రాయించారని అమరనాద్ అన్నారు.

tags : gudiwava amaranath

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info