A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మండలి ఏర్పాటు వ్యతిరేకిస్తూ బాబు ఏమన్నారంటే..
Share |
February 25 2020, 11:31 am

శాసనమండలి ఏర్పాటును వ్యతిరేకిస్తూ 2004లో ఆనాటి ఉమ్మడి ఎపి శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం వీడియోని ప్రస్తుత శాసనషభలో ప్రదర్శించారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఇలా మాటలు మార్చి ఏదైనా చెప్పగల నేర్పరితనం ఒక్క చంద్రబాబు సొంతం అని ఆయన అన్నారు. శాసనమండలి వల్ల ప్రజా దనం వృదా తప్ప మరొకటి కాదని ఆరోజు చంద్రబాబు అన్నారు. అంతేకాక చరిత్రలో బాబూ రాజేంద్రప్రసాద్ మొదలు జాతీయ నేతలు ఎవరెవరు మండలి వద్దన్నది కూడా ఆయన ఉదహరించారు. అసెంబ్లీలో అంతా చదువుకున్నవారు వచ్చారని,అందువల్ల మండలి వద్దని చంద్రబాబు 2004 లో వాదించారు. దీనివల్ల చట్టాల తయారులో ఆలస్యం తప్ప ప్రయోజనం లేదని కూడా చంద్రబాబు అన్నారు. ఆ వీడియోని చూపించిన తర్వాత పేర్ని నాని మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్,ప్రత్యేక హోదా అంశాలపై చంద్రబాబు ఎలా మాటలు మార్చింది వివరించారు. మండలి ఇప్పుడు ప్రజాస్వామ్య అవసరమని చంద్రబాబు అంటున్నారని ఆయన అన్నారు. బాద్యత కలిగిన జగన్ కు అదికారం దక్కితే , బాద్యత లేని చంద్రబాబుకు అదికారం దక్కితే ఉండే తేడాను చూస్తున్నామని నాని అన్నారు.చంద్రబాబు వైఖరి ఎంత దారుణంగా ఉంటోందో చూస్తున్నామని ఆయన అన్నారు.పత్రికా రంగం కూడా ఇలాగే తయారైందని అన్నారు.

tags : perni nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info