A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబు ఎందుకు రాలేదంటే బయటపెట్టిన దర్మాన
Share |
February 25 2020, 10:39 am

ప్రజల పట్ల సృహ కలిగిన వారు ఎవరూ శాసనమండలి కొనసాగింపును కోరుకోరని మాజీ మంత్రి ,శ్రీకాకుళం వైసిపి ఎమ్మెల్యే దర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన మండలి రద్దుపై ప్రవేశపెట్టిన తీర్మానం పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. మండలులు ఉండాలా?వద్దా అన్నదానిపై తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చాలా స్పష్టంగా వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని తాను చెబుతున్నానని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినవారికి ఇది ఒక వేదికగా మారిందని, వారు మండలిలో కూర్చుని ప్రబుత్వాన్ని తప్పు పడుతున్నారని, దానికి ఉదాహరణ లోకేష్ అని ఆయన అన్నారు. అంతేకాదు..గతంలో టిడిపి మండలి ని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో తీర్మానం పెట్టారని దర్మాన ఆ రికార్డులలోని చదివి వనిపించారు. ఎన్.పి దుర్గ అనే టిడిపి ఎమ్.పి 2007లో రాజ్యసబలో మండలి వల్ల ప్రజా ధనం వృదా తప్ప మరొకటి కాదని అన్నారని, అంతేకాక, మండలి వల్ల ప్రత్యేక ప్రయోజనం లేదని కూడా టిడిపి వాదించిందని ఆయన అన్నారు. ఈ విషయాలన్ని బయటకు వస్తాయనే చంద్రబాబు, టిడిపి ఎమ్మెల్యేలు సభకు రాలేదని ,ముఖం చూపించలేకే రాలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిద్వారా చంద్రబాబు డొల్లతనం బయటపడుతుందనే ఆయన భయపడి రాలేదని ఆయన అన్నారు.

tags : dharmana, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info