A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మండలి రద్దు తీర్మానంపై చర్చ ఆరంభం
Share |
February 25 2020, 8:44 am

ఎపి అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ తీర్మానం తీసుకు రావల్సిన అవసరాన్ని వివరించారు. రెండు రాష్ట్రాలుగా ఎపి విడిపోవడానికి ప్రదాన కారణం టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరాన్ని కోల్పోయామని ఆయన అన్నారు. అది ఆంద్ర ప్రాంత పిల్లల భవిష్యత్తు అని ఆయన అన్నారు. ఇక్కడ నుంచి ప్రతి రూపాయిని తీసుకు వెళ్లి పెట్టుబడి పెట్టాం అని ఆయన అన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు మొత్తం రాజధానిని రియల్ ఎస్టేట్ గా మార్చేశారని ఆయన అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ప్రాంతాల అబివృద్దికి కట్టుబడి పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఆ క్రమంలో అమరావతి రాజదానితో పాటు విశాఖ, కర్నూలు లను కూడా రాజధానులుగా అబివృద్ది చేస్తామని జగన్ చెబుతుంటే, దానిని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.ఈ పరిస్థితిలో మండలిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారని ఆయన అన్నారు. ఈ నేపద్యంలోనే మండలిని రద్దు చే్స్తూ తీర్మానం చేయవలసి వచ్చిందని ఆయన అన్నారు.

tags : alla nani, council

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info