A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గవర్నర్ ,స్పీకర్ లకు టిడిపి లేఖ
Share |
February 25 2020, 8:43 am

గతంలో ఎక్కువ రోజులు శాసనసభ సమావేశాలు జరపాలని టిడిపి డిమాండ్ చేసేది. కాని ఇప్పుడు భిన్నమైన వాదన తీసుకుంటోంది. మూడు రోజుల పాటే అసెంబ్లీ నడుపుతామని చెప్పిన ప్రబుత్వం బీఏసీకి చెప్పకుండానే ఇష్టానుసారం సభను పొడిగించారని విమర్శించింది. ఈ మేరకు టిడిఎల్పి గవర్నర్ కు, స్పీకర్ కు ఒక లేఖ రాసింది. సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లును అసెంబ్లీలో చర్చించడం నిబంధనలకు విరుద్ధమని టిడిపి ఆరోపించింది. అంతేకాకుండా కౌన్సిల్లో మాట్లాడిన అంశాలను శాసనసభలో ప్రస్తావించ కూడదని లేఖలో తెలిపింది. రాజ్యాంగ విరుద్ధంగా జరిగే చర్చలో పాల్గొనకూడదనే ఉద్దేశంతోనే సభను బహిష్కరించినట్లు టీడీఎల్పీ తెలపింది.
మొత్తం మీద సభకు రాకుండా ఉండడానికి టిడిపి ఒక సాకు వెతుక్కుందన్నమాట.

tags : tdp, governor, speaker

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info