A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కలుగులో ఎందుకు దాక్కున్నారు
Share |
February 25 2020, 7:32 am

శాసనసభ సమావేశానికి వచ్చి తమ వాదన వినిపించాలని టిడిపిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరింది.తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇప్పుడు సభకు రాకుండా ఉందని విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రశ్నించారు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కలుగులో దాక్కున్నారని, ఆయన అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారని చెవిరెడ్డి అ్ననారు.దీనికి కారణం గతంలో మండలి పునరుద్దరణ సమయంలో చంద్రబాబు చేసిన ప్రసంగం ప్రస్తావనకు వస్తుందన్న భయమేనని ఆయన అన్నారు. ఆనాడు మండలి పునరుద్దరణను వ్యతిరేకించారని, ఇది కవలం డబ్బు దండగ చర్య అని ఆ రోజు మాట్లాడారని చెవిరెడ్డి గుర్తు చేశారు. కాని ఇప్పుడు తన కుమారుడు లోకేష్ కోసం మండలి ఉండాలని అంటున్నారని ఆయన అన్నారు.మండలిని తన కుట్రలకు వేదికగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు.అందుకే మండలిని రద్దు చేయవలసి వస్తోందని ఆయన అన్నారు.

tags : chevireddy, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info