A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజధాని పై కృత్రిమ ఉద్యమం
Share |
February 25 2020, 7:40 am

బినామీ భూముల వ్యవహారం బయటపడుతుందనే.. అమరావతి ప్రాంతంలో కృత్రిమ ఉద్యమం సృష్టించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.గతంలో దళితులను భయపెట్టి చంద్రబాబు భూములను తీసుకున్నారు. లోకేష్‌ను ఓడించి, సీఎం జగన్‌ నాయకత్వాన్ని ఆహ్వానించిన ప్రాంతాన్ని.. ఆ ప్రజలను మేం ఎట్లా విస్మరిస్తాం. అమరావతి ప్రాంతంలో భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది.

5 కోట్ల ప్రజల ఆకాంక్షలకను నెరవేర్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా తన కుటుంబం, వారి కష్టనష్టాలు తనవి అనుకుని సీఎం వైఎస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారు. చంద్రబాబు మాత్రం.. నాది, నా కుంటుంబం అనుకుని రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారు. ఎదురీదడం సీఎం జగన్‌ లక్షణం. ఆయన మరోసారి ప్రజలతో మమేకం కావాలనుకుంటున్నారు. నిజాయితీ, నిబద్ధత ఆయన నైజం. మనీ, మీడియా, మ్యానిప్యులేషన్‌ ఇవి చంద్రబాబు లక్షణాలు. ప్రభుత్వాన్ని, వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవడం చంద్రబాబు నైజం. ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం

tags : sajjala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info