A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ 80 లక్షలే ఖర్చు చేసింది
Share |
February 24 2020, 1:09 am

కొన్ని ప్రతిపక్షాలు తమపై అదికార దుర్వినియగం ఆరోపణలు చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తాము వేల కోట్లు ఖర్చుపెట్టామని కొందరు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రిని, టిఆర్ఎస్ ను, ఎమ్మెల్యేలను పట్టుకుని ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ,ఇది ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు. మీరు గెలిచిన కొన్ని మున్సిపాల్టీలలో కూడా అలాగే గెలిచారా అని ఆయన అన్నారు. ప్రజలు ఇలాంటి ఆరోపణలు క్షమించడం లేదని ,అయినా వారు తమ పద్దతి మార్చుకోకపోతే వారి ఖర్మ అని ఆయన అన్నారు. నిర్మాణాత్మక విమర్శలు చేయడం మంచిదని కెసిఆర్ ప్రతిపక్షాలకు హితవు చెప్పారు.తమకు ఇది టాస్క్ అయితే ఇతర పార్టీలకు రాజకీయం క్రీడ అని ఆయన అన్నారు.తాను అసలు అదికారులతోనే మాట్లాడలేదని , ప్రచారంలో పాల్గొనలేదని ఆయన అన్నారు. కేవలం 80 లక్షల రూపాయల ఎన్నికల మెటీరియల్ మాత్రం పంపించామని అన్నారు. పార్టీ అభ్యర్ధులకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన అన్నారు.

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info