A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో సిసిసి పెట్టుబడులు
Share |
February 24 2020, 1:27 am

ఏపీలో వచ్చే మూడేళ్లలో రూ.5,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(కాంకర్‌) ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కళ్యాణ్‌రామ్‌ అంగీకరించారు. సమావేశం నిర్ణయాలను బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ సర్వీసెస్‌ కల్పనారంగంలో కాంకర్‌ సంస్థ అగ్రగామిగా ఉంది. కంటైనర్‌ ట్రైన్‌ సర్వీసెస్‌లో 75% మార్కెట్‌ షేర్‌తో దేశంలోనే టాప్‌ 500 కంపెనీల్లో 196వ స్థానంలో ఉంది. సంస్థ ఇప్పటికే కడపలో కంటైనర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్, విశాఖలో లాజిస్టిక్‌ వర్సిటీల ఏర్పాటుకు ముందుకొచ్చింది. తాజాగా విశాఖ పోర్టులో రూ.500 కోట్లతో, కృష్ణపట్నం పోర్టులో రూ.400 కోట్లతోనూ, కాకినాడ పోర్టులో రూ. 300 కోట్లతో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్స్‌ (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటు చేయనుంది. మచిలీపట్నం పోర్టు అభివృద్ధితో పాటు ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌జోన్‌ (ఐఎంఎల్‌జెడ్‌) ఏర్పాటుకు రూ.3వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

tags : bala sourty

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info