A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేను భయంకరమైన హిందువుని-అయితే..
Share |
February 24 2020, 1:45 am

తాను భయంకరమైన హిందువునని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. అలాగే తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని ఆయన చెప్పారు.నేను హిందువు కాదా? భయంకరమైన హిందువును. నాలాగా యాగాలు చేసిన వారున్నారా? వాళ్లు గది లోపల యాగాలు చేస్తే నేనే బహిరంగంగా చేస్తాను. లక్షల మందితో యాగాలు చేశానని ఆయన చెప్పారు. బీజేపీ నేతలు చెప్తేనే హిందుత్వం గురించి తెలిసిందా? ప్రజాస్వామ్యం పేరుతో రాజకీయాల్లోకి వచ్చి అందరి ఓట్లతో అధికారం చేపట్టి ఒక్క మతానికే వంతపాడుతానంటే కుదరదు. హిందువులే కావాలంటే జీయర్‌ స్వామి, శంకరాచార్యులు పెట్టుకున్నట్టు బీజేపీ కూడా ఆశ్రమాలు పెట్టుకోవాలని కెసిఆర్ అన్నారు. అప్పుడైతే అక్కడికి హిందువులు మాత్రమే వస్తారు. పిల్లిని అయినా గదిలో వేసి బంధిస్తే ఎదురు తిరుగుతుంది.మరి సీఏఏ పేరుతో కోట్లమందిని క్షోభకు గురిచేస్తే ఎదురు తిరగకుండా ఎలా ఉంటారు? మనం తానాషాహీలం కాదు. ఈ అధికారం ప్రజలిచ్చారు. దేశానికి ఫెడరల్‌ విధానమే శ్రీరామరక్ష. కర్ర పెత్తనం పనికిరాదు. మన రాజ్యాంగం ఇదే చెబుతోంది. వందశాతం ఫెడరల్‌ పాలనే సాగుతుంది. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు కూడా పడిపోయిన విషయం మనం చూసినం. దీనిని గుర్తుంచుకోవాలి. సీఏఏపై అమిత్‌షా వెనక్కి తగ్గనంటున్నారు.. దీనిపై నేను కూడా ముందుకే వెళ్తా అని ఆయన అన్నారు.

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info