A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏడాది లో నిరక్షరాస్యత పోవాలి
Share |
February 24 2020, 1:51 am

తెలంగాణలో నిరక్షరాస్యత ఇప్పటికీ కొనసాగడానికి కాంగ్రెస్,టిడిపి ల పాలనే కారణమని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మన తెలంగాణకు ఒక మచ్చ ఉంది. అంతా మేమే చేశాం. వాళ్లు ఏం చేయలేదని కాంగ్రెసోళ్లు జబ్బలు, తొడలు చరుచుకున్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత వాళ్ల 50 ఏళ్ల పాలన పుణ్యమే కదా? కాంగ్రెస్‌, టీడీపీ వాళ్లు ఇచ్చిందే. నా ఊరిలో నిరక్షరాస్యత ఉండొద్దు. నా ఊరికి ఇది అవమానం అని ఏ ఊరికి ఆ ఊరి సర్పంచ్‌ అనుకుంటే నిరక్షరాస్యత ఉంటుందా? నేనే త్వరలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా. నిరక్షరాస్యత అనేది తెలంగాణలో ఉండొద్దు. దీన్ని కచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఏడాదిలోగా ఈ మచ్చ తొలగిపోవాలి. మనుషులు మృగాల్లా ప్రవర్తించే పద్ధతి పోవాలని కెసిఆర్ అన్నారు.

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info