A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రామోజీరావు పై బొత్స విసుర్లు
Share |
February 24 2020, 1:07 am

శాసనమండలిలో టిడిపి వ్యవహరించిన తీరు రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్లుగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి దారుణమని, దీనికి ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియాలు వత్తాసు పలుకుతున్నాయని ఆయన విమర్శించారు. వారికి నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నారు. మండలిలో జరిగిన పరిణామాలను సమర్దిస్తున్నారా?రామోజీని అడుగుతున్నా..నిబందనలకు విరుద్దంగా వ్యవహరించిన మండలిని సమర్దిస్తారా?వ్యతిరేకిస్తారా?1983 లో టిడిపి మండలిని రద్దుచేయాలని ప్రతిపాదించినప్పుడు ఈనాడు సమర్దించింది.2020లో మరో మాట చెబుతున్నారు. 1983లో ఇదే పత్రిక మండలిని హేళనగా రాసిందని, అప్పుడు చైర్మన్ ముఖాసిర్ షా ప్రత్యేకంగా రామోజీని కౌన్సిల్ కు రావాలని ఆదేశించారని , అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. తో కలిసి దానిని రద్దు చేయించిన మాట నిజం కాదా అని ఆయన అన్నారు. 2020లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వికేంద్రీకరణ బిల్లును తెచ్చి 13 జిల్లాలను అబివృద్ది చేయాలని ప్రయత్నిస్తుంటే, ఎస్సటి, ఎస్టి కమిషన్ బిల్లులు తెస్తే, ఆంగ్ల మీడియం బిల్లు తెస్తే వాటిని మండలిలో అడ్డుపుల్ల వేశారు.రాజకీయ ఆలోచనతో అలా చేశారు.మండలి చైర్మన్ సీటుకు మచ్చ తెచ్చేలా వ్యవహరించారు. అప్పుడు రామోజీ వ్యక్తిగత లాభం కోసం 1983లో మండలిని రద్దు చేశారని, కాని ఈనాడు పదమూడు జిల్లాల ప్రయోజనం కోసం,బడుగు వర్గాల సంక్షేమం కోసం, పిల్లల భవితవ్యం కోసం తాము బిల్లులు తెస్తే ఇదే ఈనాడు మండలి రద్దును వ్యతిరేకిస్తోంది. ఈ వైఖరి మారడానికి కారణం ఏమిటి?సి.ఎమ్. జగన్ గారు తమ విదానాలను చెప్పారు.మేదావులంతా ఆలోచించాలని జగన్ కోరారు. దానికి రామోజీ వక్రభాష్యం చెబుతున్నారు.ఈనాడులో ఆపరేషన్ ఆకర్ష ..అని రాసింది. ప్రలోభాలు పెడుతున్నారని, కోటి రూపాయలు ఎమ్మెల్సీ కి ఆఫర్ చేస్తున్నారని రాసింది.చంద్రబాబు నైజం,మానిప్యులేషన్ కు ఈనాడు,రామోజీరావు కొమ్ము కాస్తున్నారు. మీలాగా దుష్ట ఆలోచనతో ఉంటారని అనుకోవడం తప్పు.మొదటి రోజే ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. పిరాయింపులు,ప్రలోభాలకు తావివ్వను అని చెప్పారు. ఆ అవసరం లేదని చెప్పారు. దానిని గుర్తు చేస్తున్నాను. అర్దరాత్రి హైదరాబాద్ వదలి విజయవాడకు చంద్రబాబు అప్పట్లో ఎందుకు వచ్చింది అందరికి తెలుసు. ఓటుకు నోటు కోసులో చంద్రబాబు ఏమి చేసింది అంతా చూశాం. గత సభలో ఎమ్మెల్యేలను ఎలా కొన్నారో చూశాం.ఎమ్.పిలను ఎలా ఆకర్షించారో చూశాం.అందువల్లే టిడిపి మూల్యం చెల్లించుకుంది.ప్రజాస్వామ్యబద్దంగా జగన్ ఆలోచిస్తున్నారు.ఈ విషయాన్ని రామోజీ,చంద్రబాబులు పట్టించుకోరా? అని బొత్స ప్రశ్నించారు.

tags : botsa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info