A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గవర్నర్ నోట విశాఖ కార్యనిర్వాహక రాజధాని
Share |
February 24 2020, 2:11 am

అభివృద్ధి వికేంద్రీకరణ వల్లే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు. రిపబ్లిక్ డే ఉత్సవం సందర్భంగా పతాక ఆవిష్కరణ చేసి ప్రసంగించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
నవరత్నాల ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృసి చేస్తుందన్నారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రసుతం గ్రామ సచివాలయల ద్వారా 500 రకాల సేవలు అందుతున్నాయని, వీటి ద్వారా రాష్ట్రంలోని నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు లభించడం పట్ట హర్షం వ్యక్తం చేశారు. నవశకం ద్వారా అన్ని వర్గాల సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగుతుందని తెలిపారు.

tags : harichandan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info