A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజ్యసభ టివి-అమరావతి చర్చ - వెంకయ్యపై అపోహ
Share |
February 24 2020, 1:11 am

రాజ్యసభ టివి లో చర్చల పేరుతో ఎపిలో పాలనా వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరిగిందని ఈనాడు ఒక వార్త ఇచ్చింది. అందులో అచ్చంగా తెలుగుదేశం అనుకూల వాదన వినిపించేవారినే పెట్టి చర్చ జరపడం విశేషంగా ఉంది.రాజ్యసభ చైర్మన్ గా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉంటారు. ఆయనకు తెలిసి జరిగిందా?లేక కాకతాళీయంగా జరిగిందో కాని, ఇలాంటి చర్చల వల్ల అనవసరంగా వెంకయ్య నాయుడుపై మరిన్ని అపోహలు పెరుగుతాయి. ఆయన కావాలని ఇలాంటి చర్చలను ప్రోత్సహిస్తున్నారన్న భావం ఏర్పడుతుంది. ఒక వేళ చర్చ జరిగితే వికేంద్రీకరణ ఎందుకు చెబుతున్నారో ఎపి ప్రభుత్వ వాదనను వినిపించేవారిని కూడా పెట్టుకోవాలి కదా..ఇప్పుడు దేశ వ్యాప్తంగా సిఎఎ , ఎన్.ఆర్.సి.వంటివాటిపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుఉగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా కూడా రాజ్యసభ టీవీలో చర్చలు జరుపుతారా? దీనివల్ల చంద్రబాబుతో ఉన్న సంబందాల వల్లే వెంకయ్య నాయుడు ఆద్వర్యంలోని టీవీ ఇలా చేస్తోందని అనుకునే అవకాశం ఉంటుంది.

tags : venkayya tv

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info