A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది
Share |
February 24 2020, 1:12 am

కేంద్ర ప్రభుత్వ పదకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని దీనివల్ల ప్రజలకు నష్టం వాటిల్లుతోందని బిజెపి అద్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వివక్ష చూపడం లేదని, తెలంగాణకు రావాల్సిన నిధులను ఇస్తోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ప్రాంతీయ పార్టీలను కూడగడుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.సీఎం కేసీఆర్‌ మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అవకాశవాద రాజకీయ వాదులను తిప్పికొట్టాలని ఆయన అన్నారు.

tags : lakshman

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info