A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ లో భవిష్యత్తు భయమే కనిపించింది
Share |
February 24 2020, 1:14 am

కె.కృష్ణసాగర్ రావు,బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి చేసిన ప్రకటన ఇది.



తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీలు నిస్సిగ్గుగా చేసిన అధికార దుర్వినియోగానికి నిదర్శనం.

ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచీ టిఆర్ఎస్ పార్టీ మోసాలను, దాడులనూ తట్టుకుని కూడా బీజేపీ, 9 కార్పొరేషన్లలోని డివిజన్ల గెలుపులో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ రెండో స్థానం నుంచి కూడా తప్పుకుంది.

ఒకవేళ ఎన్నికలు చట్టప్రకారం, న్యాయంగా ఎన్నికల సంఘ నియమావళి ప్రకారం జరిగి ఉండుంటే బీజేపీ టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎదిగి ఉండేది.

మోసాలు, అధికార దుర్వినియోగం, భౌతిక దాడులు, నల్ల డబ్బు, అనైతిక పద్ధతులతోనే ఈ ఫలితాలు సాధించినందుకు, ఈ రోజు వచ్చిన ఫలితాలు చూసి, టిఆర్ఎస్ గర్వించడం కాదు, సిగ్గుపడాలి.

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రకాలుగా విఫలం చేశారు. గెలిచొచ్చి తప్పుడు ప్రసంగాలు ఇస్తున్నారు. రాష్ట్రం దివాలా తీస్తోందని చెప్పడానికి ఆయన మాటలే ఉదాహరణ. కేసీఆర్ ఆర్థిక నిర్లక్ష్యమే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించేసింది.

భారీ అవినీతి, పాలనకు, పథకాలకూ నిధుల లేమి, అభివృద్ధి పథకాలు పెట్టుబడులు పెట్టలేకపోవడంలో ముఖ్యమంత్రి వైఫల్యం - ఇవే వచ్చే ఎన్నికల్లో ఎజెండా కాబోతున్నాయి.

కేసీఆర్ గంటసేపు ప్రెస్ మీట్లో మాట్లాడినదాన్నిబట్టి చూస్తే, తాజా గెలుపు కంటే, భవిష్యత్తుపై భయమే ఆయనలో ఎక్కువ కనిపించింది.

ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించే పార్టీగా బీజేపీ ప్రజాతీర్పును అంగీకరిస్తోంది.

అయితే మేం టిఆర్ఎస్ పార్టీ తప్పుడు విజయాన్ని మాత్రం గౌరవించడం లేదు. ఎందుకంటే టిఆర్ఎస్ గెలుపు ప్రజల మనసులను ప్రతిబింబచడం లేదు. అది న్యాయమైన, స్వేచ్ఛాయుతమైన ఎన్నికల నుంచి వచ్చింది కాదు.

tags : krishna sagar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info