A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బెంజ్ సెంటర్ పైఓవర్ -టిడిపి భిన్న వాదనలు
Share |
February 24 2020, 2:15 am

విజయవాడ బెంజ్ సెంటర్ వద్ద నిర్మించిన ప్లైఓవర్ పై టిడిపి ఎమ్.పి, కేశినేని నాని, టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ల ప్రకటనలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎమ్.పిగారు ఈ వంతెనకు రాష్ట్ర ప్రభుత్వంతో సంబందం లేదని ప్రకటిస్తే, ఎమ్మెల్యేగారు ఇది చంద్రబాబు నాయకత్వంలో చేపట్టినట్లు ప్రకటించారు. అదీ సంగతి . మరీ ఈ ఎనిమిది నెలల్లో చేపట్టిన జగన్ ప్రభుత్వానికి ఏ సంబందం ఉండదా?

యం పి కేశినేని నాని కామెంట్స్..*

రెండు జాతీయరహదారిలను కలిపే ఈ బెంజ్ సిర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణం కారణంగా ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు పరిస్కరం కాబోతున్నాయి .మరో వారం రోజులులో ఈ ఫ్లై ఓవర్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో రానుంది అని.. రాష్ట్రప్రభుత్వంకు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఎటువంటి సంబంధం లేదు .టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది .ఈ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ది. రాష్ట్రప్రభుత్వంకు సంబంధం లేదని. యం.పిగా ఎమ్మెల్యేగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో మాకు మాత్రమే సంబంధించినది

*ఎమ్మెల్యే గద్దె రాం మోహన్ కామెంట్స్..*

ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ ఫ్లై ఓవర్ కోసం 20 సం.లుగా డిమాండ్ ఉంది కాని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2015లో నూతనమోడల్ లో ఈ నిర్మాణం చేయడానికి ఒకలైన్ పూర్తి చేయడం జరిగింది .ఈ ప్రాజెక్టును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సహకారంతో యం.పి గారి ఆశయంతో ముందుకు సాగింది

పడమటలంకకోసం ఒకసబ్ వే నిర్మాణం చేయడం జరిగింది
గతంలో పాలకులు వారధి ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా రాణిగారి తోట ముసుకోపోయింది ఇక్కడకూడా సబ్ వే కోసం. ముందుకు వెళ్లడం జరుగుతుంది
ఈ ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులో రావడం చాలా సంతోషంగా ఉందని..అన్నారు

tags : tdp fly over, vja

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info