A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు జనసేన, బిజెపి ఎందుకు మద్దతా
Share |
February 24 2020, 1:15 am

హైకోర్టును శాశ్వతంగా సీమలోనే ఏర్పాటు చేస్తామని బీజేపీ చెప్పిందని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. . హైకోర్టుపై బీజేపీ కట్టుబడి ఉందో లేదో సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ‘అమరావతి నిర్మాణం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలా సాగుతుందని బిజెపి చెప్పింది నిజం కాదా..? అధికారంలోకి రాగానే రాజధాని రైతులకు న్యాయం చేస్తామన్నారు. ఆ హామీలు బీజేపీ నేతలకు గుర్తున్నాయా?’ అని అంబటి ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు బీజేపీ అండదండలు ఇంకా దేనికని.. చంద్రబాబుకు అనుకూలంగా బీజేపీ, జనసేన పనిచేస్తున్నాయని విమర్శించారు. 151 సీట్లు ఇచ్చి.. ప్రజలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని.. ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం తమ​‍కు ఉందన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందని పేర్కొన్నారు.

tags : ambati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info