A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
త్వరలో గల్ప్ దేశాలకు వెళతా- సి.ఎమ్
Share |
February 24 2020, 2:17 am

తాను త్వరలో గల్ప్ దేశాలలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. తెలంగాణ లోని పదహారు నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది గల్ప్ దేశాలలో పని చేస్తున్నారని ఆయన చెప్పారు.సిరిసిల్ల నుంచి కూడా పలువురు వెళ్లారని ఆయన అన్నారు. కెటిఆర్, ఆ సంబందిత ఎమ్మెల్యేలు ముందుగా దుబాయి తదితర దేశాలలో పర్యటించి మనవాళ్ల పరిస్థితి స్టడీ చేస్తారని అన్నారు. హైదరాబాద్ లో ఎన్నో అవకాశాలు ఉంటే వారు వీటిని వదలుకుని దుబాయి వెళుతున్నారని, ఇక్కడ అప్పులు చేసి వెళుతున్నారని , అక్కడ అనేక కష్టాలు పడుతున్నారని అన్నారు. హైదరాబాద్ ,ఇతర ప్రాంతాలలో యుపి, బీహారు, తదితర ప్రాంతాల నుంచి వచ్చినవారు పనిచేస్తున్నారని అన్నారు.నాక్ కింద ప్రతి నియోజకవర్గంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. గల్ప్ లో ఉన్నవాళ్లతో, అంబాసిడర్ తోను, అలాగే కంపెనీలవారితో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం చేస్తామని ఆయన చెప్పారు

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info