A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిసిఎ పై కెసిఆర్ కీలక ప్రకటన
Share |
February 24 2020, 1:57 am

సిసిఎ అంటే పౌరసత్వ సవరణ చట్టం పై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదనిఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని, దాన్ని కేంద్రానికి పంపిస్తామని ఆయన తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యం ప్రభుత్వం.. వారు ఒప్పుకొంటేనే ముందుకెళ్లాలని, వద్దంటే ఆగిపోవాల్సిందేనని అన్నారు. మొండిగా ముందుకెళ్లేందుకు ఇది మిలిటరీ ప్రభుత్వం కాదని, ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకు పాలకులు తానీషాలు కాదని వ్యాఖ్యానించారు. సీఏఏకు వ్యతిరేకంగా దేశం మొత్తం అట్టుడికిపోతుంటే కేంద్రానికి ఎందుకింత పట్టుదల? అని పఆయనఅ న్నారు. దేశాన్ని మత రాజ్యాంగా అంగీకరించబోమని ఆయన అన్నారు.అవసరమైతే నెల రోజుల్లో ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తామని, 10 లక్షల మందితో బహిరంగసభ పెడతామని అన్నారు.

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info