A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దారిన పోయే ప్రతివాడు నా బినామీ అంటారా-లోకేష్
Share |
February 24 2020, 1:26 am

దారిన పోయే ప్రతివాడిని తన బినామీ అంటారా అని మాజీ మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స కూడా తనకు బినామీయేనా అని ఆయన అన్నారు.శాసనమండలిలో జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూఈ వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో రూల్‌ 71పై మంగళవారం జరిగిన చర్చలో భాగంగా రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. దీనిపై మంత్రి బొత్స అభ్యంతరం చెప్పి, 2015లోనే బాలకృష్ణ బంధువు జయంతిపురంలో భూములు తీసుకున్నారని జీవో చూపించారు. దీనిపై లోకేశ్‌ అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం ఆ భూమి ఎవరిపేరున ఉందో, ఎవరి ఆధీనంలో ఉందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆరోపణలు నిరూపించాలని డిమాండ్‌ చేశారు. ఆ భూమి సీఎం బంధువుదని, వారి స్కెచ్‌లు, స్కాములు తెలిసే ఆ భూ కేటాయింపును రద్దు చేశామని బొత్స చెప్పారు.

tags : lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info