A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అప్పుడే టిడిపి నేతలు ప్రశ్నించి ఉండాల్సింది
Share |
February 24 2020, 1:44 am

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గా ఉన్నప్పుడు ఎందుకు సడన్ గా విజయవాడకు తరలి వచ్చారని నందిగామ ఎమ్మెల్యే ఎమ్.జగన్మోహన్ రావు ప్రశ్నించారు. అప్పుడు వేయవలసిన ప్రశ్నలను ఇప్పుడు టిడిపి నేతలు వేస్తున్నారని ఆయన అన్నారు. టిడిపి సబ్యులు ప్రతిదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ లో పదేళ్ళు ఉండే అవకాశం ఉన్నా, ఒకేసారి తరలి రావడంతో ఉద్యోగులు ఎందుకు ఇబ్బంది పడవలసి వచ్చిందని టిడిపి ఎమ్మెల్యేలు ప్రశ్నించారా అని ఆయన అన్నారు.కేంద్రం శివరామకృష్ణన్ కమిటీ ని నియమిస్తే చంద్రబాబు ప్రభుత్వం సొంతంగా ఎందుకు కమిటీ వేసుకుందని, దానిని టిడిపి వారు ఎందుకు ప్రశ్రించలేదని ఆయన అన్నారు.ఆ తర్వాత లాండ్ పూలింగ్ ను ప్రశ్నించలేదు. అమరావతిని పూర్తి చేయలేక చంద్రబాబు చతికిలపడితే ప్రశ్నించలేదు.కేంద్రమే నిర్మించి ఇస్తామని అంటే ఎందుకు చంద్రబాబు ఒప్పుకోలేదని టిడిపి వారు ప్రశ్నించలేదని జగన్మోహన్ రావు అన్నారు.
చేయాల్సిన పని చేయకుండా ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్డు తగలడం సరి కాదని ఆయన అన్నారు.

tags : monditoka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info