A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ది దిక్కుమాలిన రాజకీయం-జగన్
Share |
February 24 2020, 12:25 am

ఎస్సీల మధ్య చిచ్చుపెట్టి విభజించడం ద్వారా లబ్ధిపొందాలని చంద్రబాబునాయుడు దిక్కుమాలిన నీచ రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎస్సీ కమిషన్‌ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు పోడియంలోకి వెళ్లి నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా వైఎస్‌ జగన్‌ జోక్యం చేసుకుని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటుచేయాలని తమ సర్కారు చరిత్రాత్మక బిల్లులు తెస్తే ఎస్సీ కమిషన్‌ బిల్లును శాసన మండలి తిప్పి పంపిందని.. మళ్లీ అసెంబ్లీలో దీనిని యథాతథంగా పెడితే ఇక్కడ బలం లేనందున టీడీపీ ఎమ్మెల్యేలు పోడియంలోకి వెళ్లి రచ్చచేస్తున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు ‘జైజై అమరావతి’ అనే నినాదాలతో ఎందుకు పోడియంలోకి వెళ్లారో? ఎందుకు జైజై అమరావతి అంటున్నారో వారికే అర్థం కావడంలేదన్నారు. ఇదీ విపక్ష నేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేల దిక్కుమాలిన వైఖరి అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి తమ ధ్యేయమని.. ఇందుకు తమ చర్యలే నిదర్శనాలని.. ఎస్సీలను కలిపి ఉంచడం ద్వారానే అభివృద్ధి చేయాలని తాము ప్రయత్నిస్తుంటే చంద్రబాబు మాత్రం జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న వారిని విడదీయడం కోసం స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info