A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరో నలుగురు టిడిపి ఎమ్మెల్సీలు షాకిచ్చారా
Share |
February 24 2020, 1:48 am

తెలుగుదేశం పార్టీకి మరికొందరు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. రాత్రి పొద్దుపోయే సమయానికి శాసనమండలిలో రూల్ డెబ్బై ఒకటి కింద చర్చ తర్వాత జరిగిన ఓటింగ్ లో ఇద్దరు టిడిపి ఎమ్మెల్సీలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు గైర్ హాజరయ్యారు. పోతుల సునీత, శివనాద్ రెడ్డి అనే ఎమ్మెల్సీలు టిడిపి వారు అయినరప్పటికీ ఆ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. శత్రుచర్ల విజయరామరాజు, శమంతకమణి లు కూడా రాలేదు. కాగా డొక్కా మాణిక్ వర ప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కౌన్సిల్ లో 32 మంది సబ్యులు ఉండగా, ఇరవై ఏడు మంది ఓటు వేశారు కీలకమైన వికేంద్రీకరణ బిల్లుకు, రాజదాని సంస్త రద్దు బిల్లుకు ఇంకా ఓటింగ్ జరగలేదు. అప్పటికి ఇదే పరిస్తితి ఉంటుందా?లేక మరికొందరు ఎమ్మెల్సీలు వ్యతిరేకిస్తారా అన్నది చూడాలి.శాసనమండలి రేపటికి వాయిదా పడింది

tags : council, tdp, shock

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info