A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్కూల్ విద్యలో జగన్ ను మెచ్చుకున్న కైలాష్ సత్యార్ది
Share |
February 24 2020, 12:39 am

స్కూల్ విద్యలో ఎపి ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న స్కీములు దేశానికి మోడల్ స్టేట్ గా ఉంటుందని నోబెల్ కైలాష్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్ది అన్నారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ బాగుందని కైలాశ్‌ సత్యర్థి కితాబిచ్చారు. పేద మహిళలకు చేయూతనిచ్చే అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ పథకాల అమలుతో ఆంధ్రప్రదేశ్‌ ఒక ఆదర్శ రాష్ట్రంగా మిగిలిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ చైల్డ్‌ ఫ్రంట్‌ స్టేట్‌ అన్న ఆయన.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల చిన్నారులకు కుల, సాంఘిక వివక్ష లేకుండా విద్య అందుతుందని భావిస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ కచ్చితంగా పిల్లలు మంచి విద్య పొందేందుకు అవకాశమున్న రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. కైలాశ్‌ సత్యర్థితోపాటు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసినవారిలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉన్నారు.

tags : ap, school students

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info