A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మండలిలో మూడు రాజధానుల బిల్లుపై ప్రతిష్టంభన
Share |
February 24 2020, 1:52 am

శాసనమండలిలో మూడు రాజదానుల బిల్లుపై ప్రతిష్టంబన ఏర్పడింది. మండలి చైర్మన్ సరీఫ్ ప్రబుత్వ బి్ల్లుల కన్నా, టిడిపి ఎమ్మెల్సీలు కోరిన విదంగా వారి నోటీసుపై చర్చకు అనుకూలంగా నిర్ణయం చేయడం వివాదాస్పదం అయింది .ప్రబుత్వ బిల్లులపై చర్చ జరిగిన తర్వాత ఏ చర్చ అయినా తీసుకోవచ్చని,అలాకాకుండా టిడిపివారి ఎజెండాను ఎలా తీసుకుంటారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అబ్యంతరం చెప్పింది.దీనిపై రెండువైపులా ప్రతిష్గంబన ఏర్పడింది.బిజెపి,పిడిఎఫ్ సబ్యులు టిడిపి వైఖరిని తప్పు పట్టారు .కాగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టిడిపి సబ్యులు చెవిలో చెప్పినదాని ప్రకారం చైర్మన్ ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. ఇలాగైతే నిబందనలు, రూల్స్ ఎందుకు అని ప్రశ్నించారు.ఈ వివాదంతో శాసనమండలి పదే,పదే వాయిదా పడుతోంది.కాగా వైసిపి నేత దాడి వీరభద్రరావు మాట్లాడుతూ అసెంబ్లీ, మండలి మద్య ప్రతిష్టంబన ఏర్పడేలా మండలి చైర్మన్ టిడిపి సభ్యులు వ్యవహరించడం సరి కాదని అన్నారు. టిడిపి వారు తమకు కావల్సిన విదంగా ఓటింగ్ వేసుకోవచ్చని ,కాని అసలు చర్చే జరగకుండా ఎందుకు అడ్డుపడుతోందని ప్రశ్నించారు.

tags : ap, council

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info