A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ భీకర ప్రతిజ్ఞ
Share |
February 24 2020, 12:43 am

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీకర ప్రతిజ్ఞ చేసినట్లుగా ఉంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు నిద్రపోం అని ఆయన ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. అమరావతిలో పోలీసులతో జరిగిన ఘర్షణలలో గాయపడ్డ రైతులతో ఆయన సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసిపి వినాశనం మొదలైందని , భవిష్యత్తులో వైసిపి మనుగడ ఉండదని ఆయన అన్నారు.పోలీసుల లాఠీ చార్జీలో రైతులు గాయపడడం తనకు కంట తడి పెట్టించిందని ఆయన అన్నారు. ఏపీకి అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగితే కేసులు పెట్టవచ్చని అన్నారు. రేపు ఢిల్లీ వెళ్లి ఈ పరిణామాలను వివరిస్తానని ఆయన చెప్పారు.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info