A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎస్సిలకు అత్యంత ప్రాదాన్యం ఇస్తున్నాం-సి.ఎమ్
Share |
February 24 2020, 1:53 am

ఎస్సిల జనాబాను ఒక్కటి చేయడం కోసమే తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గత ప్రభుత్వం ఎస్సిల మద్య విబేదాలు సృష్టించిందని ఆయన అన్నారు. తాను ఆ పరిస్థితి పోయి అంతా కలిసి ఉండే వాతావరణం కోసం తాను ప్రయత్నిస్తున్నానని ఆయన అన్నారు. అందుకే ఎస్సి లలో మూడు వర్గాలకు వేర్వేరుగా కార్పొరేషన్ లు ఏర్పాటు చేశామని అన్నారు. ఎస్సిలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని బిల్లు తెస్తే టిడిపి అడ్డుకుంటోందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. గత చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఎస్సి,ఎస్టి లకు కలిపి ఆరు మంత్రి పదవులు ఇచ్చామని, ఇందులో ఇద్దరు ఎస్సి,ఎస్టిలకు చెందినవారు ఉప ముఖ్యమంత్రులు అని ఆయన అన్నారు.విద్యా,హోం శాఖ మంత్రులుగా ఎస్సిలకు అవకాశం ఇచ్చామని, అలాగే మరో మంత్రి నారాయణస్వామికి ఎక్సైజ్ శాఖ ఇచ్చామని అన్నారు.ఎస్సి, ఎస్టి లకు వేర్వేరుగా కమిషన్ లు ఏర్పాటు చేయడానికి బిల్లు పెడితే శాసనమండలిలో టిడిపి వ్యతిరేకించిందని ,అంందుకే మళ్లీ అసెంబ్లీకి తెచ్చామని ఆయన అన్నారు.కాగా టిడిపి ఎమ్మెల్యేలు తమ ఆందోళన కొనసాగించారు.

tags : jagan, jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info