A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కౌన్సిల్ లో టిడిపికి అనుకూలంగా చైర్మన్ నిర్ణయం
Share |
February 24 2020, 12:47 am

శాసనమండలి లో మూడు రాజధానుల విషయం పై చర్చ గందరగోళం గా మారింది.ప్రబుత్వ బిల్లులపై కాకుండా ,ప్రతిపక్ష టిడిపి రూల్ 71 కింద ఇచ్చిన నోటీసుపై చర్చకు మండలి ఛైర్మన్ షరీఫ్్ అంగీకరించడం వివాదాస్పదం అయింది. ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తమ నోటీసుపై చర్చ జరగాలని కోరారు. కాని మంత్రులు బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, పిల్లి సుబాష్ చంద్రబోస్ లు ఒప్పుకోలేదు. ప్రభుత్వ బిల్లులపైనే చర్చ జరగాలని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపద్యంలో శాసనమండలిలో ఏమి జరుగుతుందన్న ఉత్కంఠ ఏర్పడింది. మరో వైపు టిడిపి ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్ వర ప్రసాద్ తన పదవికి రాజీనామా చేయగా, మరో ఎమ్మెల్సీ శమంతకమణి అనారోగ్యంతో సబకు రాలేదని చెబుతున్నారు. మరో ఎమ్మల్సీ రత్నబాబు కూడా సమావేశాలకు రాలేదని సమాచారం వచ్చింది. కాగా బిజెపి ఎమ్మెల్సీ మాదవ్ కూడా సభకు రాలేదు.

tags : ap, council

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info