A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతి దందాపై వెంటనే కేసు పెట్టాలి-బిజెపి
Share |
February 24 2020, 1:53 am

ఎపి రాజదాని అమరావతి విషయంలో టిడిపి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ లు చేస్తున్న వ్యవహారాలు సజావుగా లేవని బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు అన్నారు. మూడు రాజదానుల అంశం మిద్యగా ఉందని అన్నారు. హైకోర్టు కర్నూలులో పెట్టాలని తాము కూడా కోరుకున్నామని, కాని దానికి కూడా రాజదాని అని పేరు పెట్టారని ఆయన అన్నారు. అమరావతిని ఉత్తుత్తి రాజధానిగా మార్చుతారని ఆయన అన్నారు. లీగల్ గా ఇబ్బంది లేకుండా అమరావతి రాజదాని కొనసాగుతుందని చెబుతున్నారా?అని ఆయన అన్నారు. కాగా ఇది కేంద్రం పరిదిలో లేనిదని ,అయినా కొందరు ఇదంతా కేంద్రం కు చెప్పే, బిజెపి పెద్దలతో చెప్పే చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని టిడిపి అంటున్నదని, అంటే టిడిపి విఫలం అయిందని చెప్పాలని ఆయన అన్నారు. టిడిపి దద్దమ్మ పాత్ర పోషిస్తుందా అని ఆయన అన్నారు. వైసిపి నేతలు టిడిపి వారు ఎన్ని వేల ఎకరాలు కొన్నారో చూపించారని, అయినా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని జివిఎల్ ప్రశ్నించారు.రెండు ప్రాంతీయ పార్టీలు దూషించుకుంటూ రక్షించుకుంటున్నాయా అని ఆయన అన్నారు.ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు.రేపటి లోగా రాజదాని అవినీతిపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజదాని నష్టానికి రెండు ప్రాంతీయ పార్టీలు బాద్యత తీసుకోవాలని అన్నారు.చంద్రబాబు ఐదు భవనాలు కట్టలేక చేతకాని వ్యక్తిగా మిగిలిపోయారని ఆయన అన్నారు.

tags : gvl

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info