A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ నిరసన-వాకైట్
Share |
February 24 2020, 1:54 am

ఎపి అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ వాకౌట్ చేశారు. టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశం ఆరంభం అయిన తర్వాత టిడిపి ఎమ్మెల్యేలు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. వారిని చాలా సేపు స్పీకర్ వారించారు. ఎస్సి కమిషన్ బిల్లుకు సంబందించి చర్చ జరగవలసి ఉండగా, టిడిపి ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. వైసిపి ఎస్సీ ఎమ్మెల్యేలు పలువురు ఈ పద్దతి మంచిది కాదని ప్రసంగించారు. అయినా టిడిపి ఎమ్మల్యేలు ఆగలేదు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా టిడిపి ఎమ్మెల్యేలు వినకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆగ్రహం చెంది ఆయన మైకును విసిరేసి తాను నిరసన గా వెళ్లిపోతున్నానని ప్రకటివంచి వెళ్లిపోయారు.టిడిపి ఎమ్మెల్యేల తీరుతో తాను మనస్తాపానికి గురవుతున్నానని ఆయన ప్రకటించారు. ఇందుకు నిరసన తెలుపుతున్నానని ఆయన ప్రకటించారు.

tags : tammineni ,speaker ,walkout

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info