A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు నేను నమస్కారం చేస్తున్నా..
Share |
February 24 2020, 12:49 am

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన బినామీల కోసం ఆరాటపడుతున్నారు తప్ప.. ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించడం లేదని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి బాస్కరరెడ్డి అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు తాను నమస్కారం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నానని, దయచేసి రాష్ట్ర అబివృద్దికి సహకరించాలని కోరుతున్నానని అన్నారు.చంద్రబాబు సామాజిక వర్గ ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. కానీ సీఎం జగన్‌ అలాంటివారు కాదు. రాష్ట్రంలో ప్రతి పల్లెను, అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఆయనను అన్నికులాలు ఆదరిస్తున్నాయి. అందుకే 151 సీట్లు ప్రజలు కట్టబెట్టారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆయనలో చాలా అద్భుతమైన నటుడు ఉన్నారు. జగ్గయ్య, ప్రకాశ్‌రాజ్ కంటే అద్భుతంగా చంద్రబాబు నటిస్తున్నారు. 70 ఏళ్లలో బయటకు వచ్చాడు. 40 ఏళ్లలోనే ఇది జరిగి ఉంటే కచ్చితంగా ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చి ఉండేదని ఆయన అన్నారు.

tags : chevireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info