A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పులివెందులలో తిన్నా,అమరావతిలో తిన్నా రుచి...
Share |
February 24 2020, 1:29 am

‘మధ్యాహ్న భోజనం నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దు. అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన నాణ్యత ఉండాలి. ఎక్కడ తిన్నా రుచి ఒకేలా ఉండాల్సిందే. పులివెందులలో తిన్నా.. అమరావతిలో తిన్నా రుచి మారకూడదు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. నాణ్యత కోసం నాలుగు అంచెల విధానంలో తనిఖీలు ఉండాలని సూచించారు. పౌష్టికాహారంతో కూడిన మెనూతో మధ్యాహ్న భోజనం ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాణ్యత తనిఖీతో పాటు ఫీడ్‌ బ్యాక్‌ కోసం పాఠశాల స్థాయిలో పేరెంట్స్‌ కమిటీలో ముగ్గురు తల్లులను నియమించాలని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కూడా కమిటీలో చోటు కల్పించాలన్నారు. పేరెంట్స్‌ కమిటీ పిల్లలతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ కమిటీ నాడు – నేడు, పారిశుధ్యాన్ని కూడా పరిశీలించాలన్నారు. తనిఖీల పర్యవేక్షణ బాధ్యతలు ఆర్డీఓకు అప్పగించాలని, క్వాలిటీతో పాటు ఫుడ్‌ సేఫ్టీపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.

tags : mid day meals

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info