A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ గ్రామాలవారికి అన్యాయం జరగదు-హోం మంత్రి
Share |
February 25 2020, 11:36 am

అమరావతి రాజదాని ప్రాంత గ్రామాలకు తమ ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయడం లేదని హోం మంత్రి సుచరిత అన్నారు.గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు కౌలు చెల్లిస్తున్నామని ఆమె అన్నారు. రైతులకు ప్లాట్లు అబివృద్ది చేసి ఇవ్వబోతున్నామని ఆమె అన్నారు.గత ప్రబుత్వం కన్నా మంచి ప్యాకేజీని జగన్ ఇవ్వబోతున్నారని ఆమె చెప్పారు. రాజదాని మొత్తం తరలిపోతుందన్నది అవాస్తవం అని ఆమె చెప్పారు. పల్నాడులో సాగునీటి సమస్యలు, తాగు నీటి సమస్యలు పరిష్కారం కోరుకుంటారని, సచివాలయానికి వెళ్లి చూసి రావాలని ఎవరూ అనుకోరని ఆమె అన్నారు. సంవత్సరం అంతా కలిసి లక్ష మంది మాత్రమే సచివాలయానికి వెళుతుంటారని, ఐదు కోట్ల మంది ప్రజలు నిత్యం సచివాలయానికి వెళ్లరని అన్నారు.పైగా జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలు తీసుకోవచ్చి గ్రామాలలో పాలన విప్లవం తెచ్చారని సుచరిత అన్నారు.

tags : sucharita

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info